Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

రోహిత్ హాఫ్ సెంచరీ

Rohit-Sharma

పోర్ట్ ఎలిజబెత్: వేదికగా సెయింట్ జార్జ్ మైదానంలో భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధశతకం నమోదు చేశాడు. 57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఇది రోహిత్‌కు వన్డేల్లో 35వ హాఫ్ సెంచరీ. మొదటి నాల్గు వన్డేల్లో ఘోరంగా విఫలమైన రోహిత్ ఈ వన్డేలో ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీతో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం అందించాడు రోహిత్. అయితే కోహ్లీ 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో రోహిత్, కోహ్లీ భారీ భాగస్వామ్యానికి తెరపడింది. అంతకుముందు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కేవలం 23 బంతుల్లోనే 34(8 ఫోర్లు) పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్(82), రహానె(04) ఉండగా… భారత్ స్కోర్: 164/2(29 ఓవర్లు).

Comments

comments