Search
Thursday 24 May 2018
  • :
  • :

రితికాకు రోహిత్ కానుక

rht

పోర్ట్ ఎలిజబెత్: ఐదో వన్డేలో తాను సాధించిన శతకాన్ని భార్య రితికాకు ప్రేమికుల రోజు బహుమతిగా అంకితమిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను పెట్టాడు. కీలక సమయంలో సాధించిన ఈ శతకం ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపాడు. దీన్ని తన సతీమణి రితికాకు అంకితమిస్తున్నట్టు వివరించాడు. కష్ట కాలంలో తన వెన్నంటి నిలిచే భార్యత రితికా అంటే తనకు ఎంతో ఇష్టమన్నాడు. తాను సాధించిన సెంచరీ, మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌ను రితికాకు ప్రేమికుల రోజు బహుమతిగా అందిస్తున్నట్టు తెలిపాడు. రోహిత్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో పెళ్లి రోజు తన బ్యాటింగ్‌ను చూసేందుకు స్టేడియానికి వచ్చిన భార్య రితికాకు రోహిత్ డబుల్ సెంచరీతో అపురూపమైన కానుక ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా రోహిత్ పెట్టిన కామెంట్‌కు నెజిజన్ల నుంచి మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే.
ఆనందంగా ఉంది…
మరోవైపు చాలా రోజుల తర్వాత మళ్లీ సెంచరీ సాధించడం ఆనందంగా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. ఐదో వన్డేలో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. కీలక సమయంలో సాధించిన సెంచరీ ఎంతో ఊరటనిచ్చిందన్నాడు. పేలవమైన ఆటతో సతమతమయిన తనకు ఈ ఇన్నింగ్స్ ఎంతో ఆనందం కలిగించిందన్నాడు. తొలి నాలుగు వన్డేల్లో కూడా బాగానే ఆడాలని భావించానని, అయితే అందులో సఫలం కాలేక పోయానన్నాడు. ఇదిలావుండగా ఈ సందర్భంగా కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు రోహిత్ సహనం కోల్పోయాడు. రెండు, మ్యాచ్‌లలలో విఫలమైనంత మాత్రాన ఒక క్రికెటర్‌పై అదే పనిగా విమర్శలు చేయడం తగదని హితవు పలికాడు. ఏ ఆటగాడికైన కెరీర్‌లో ఇటువంటి పరిస్థితులు ఎదురు కావడం సర్వ సాధారణం అన్నాడు. అంత మాత్రాన అదే పనిగా విమర్శలు చేయడం మంచి కాదన్నాడు. కొంత కాలంగా తాను నిలకడైన ఆటను కనబరిచానని, అయితే ఈ సిరీస్‌లో విఫలం అయిన విషయం వాస్తవమేనన్నాడు. కానీ, తాను ఫాం కోల్పోయానని, తనని పక్కన బెట్టి ఇతరులకు అవకాశం కల్పించాలని మీడియా ప్రతినిధులు కోరడాన్ని రోహిత్ తప్పుపట్టాడు. ఫాం కోల్పోవడం, ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవడం ప్రతి క్రికెటర్‌కు సాధరణ అంశమేనని, దీన్ని భూతద్దంలో పెట్టి చూడడం మాత్రం మంచిది కాదని రోహిత్ సూచించాడు.

Comments

comments