Search
Friday 25 May 2018
  • :
  • :

రూ. 1కోటి మంజూరు

knr

మురికి కాలువ నిర్మాణానికి  రూ. 1కోటి మంజూరు

ధర్మపురి : ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది వద్ద మురికి కాలువ ఏర్పాటుకు రూ. 1కోటి మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ చీప్‌విఫ్ కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం ధర్మపురి క్షత్రంలోని గోదావరినది స్నాన ఘట్టాల వద్ద కలుస్తున్న మురికి నీటి కాలువను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో సమావేశమైనారు. భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలో కలుస్తున్న మురికి నీటిని ఏ విధంగా వేరు చేయాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ధర్మపురి గ్రామంలోని మురికి నీటిని స్నానఘట్టాల తర్వాత కలిసేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కాలువ ఏర్పాటుకు రూ. 1కోటి డిఎమ్‌ఎప్టీ నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ మనోహర్‌రెడ్డి, డిఈ రవికుమార్, జెఈ చలపతి, వైస్ ఎంపిపి అయ్యోరి రాజేష్‌కుమార్, దేవస్థాన చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ సంగి సత్తమ్మ, నాయకులు భీమన్న, ఒడ్నాల మల్లేశం, ధర్మకర్తలు అక్కనపెల్లి సునిల్, జెట్టి రాజన్న, మామిడి లింగన్న తదితరులు ఉన్నారు. ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్‌ను పరామార్శించి న చీఫ్‌విప్ కొప్పుల గత రెండు రోజుల నుండి జ్వరంతో బాధపడ్తున్న ధర్మపురి సింగిల్‌విండో చైర్మన్ బాదినేని రాజేందర్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పరమార్శించారు. రాజేందర్ జ్వరంతో బాధపడుతూ ఇంటివద్దే చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్నచీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ఆయన ఇంటికి వెల్లి రాజేందర్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయ న వెంట ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు.

Comments

comments