Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

రూ. 40 లక్షలతో …అభివృద్ధి పనులు ప్రారంభం

car

మనతెలంగాణ/మేళ్ళచెర్వు: మండల కేంద్రంలోని కొలువై ఉన్నా శ్రీస్వయం భూశంభు లింగే శ్వరస్వామి ఆలయంలో రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం రాత్రి దేవుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయఅర్చకులు వేద మంత్రా ల మధ్య పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతంపలికారు. దేవాలయ అర్చకులు మంత్రితో దేవాలయ విశిష్టత గురించి తెలియజేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వదించారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో రూ. 40 లక్షలరూపాయిల నిధులతో సిసి రోడ్లు, కళ్యాణ మండపం అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం విద్యుత్ ప్రభలపై ఏర్పాటు చేసిన సాంస్కృ తిక కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడుతూ శివపార్వతుల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరికీ కలగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, ఎస్పీప్రకాశ్‌జాదవ్, హుజూ ర్‌నగర్ టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి కాసో జు శంకరమ్మ, ఆలయ చైర్మన్ నరసింహారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ సైదిరె డ్డి,శ్రీనివాస్‌గౌడ్, హరి, లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments