Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

వాలెంటైన్స్ డే లుక్

cn

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సాక్ష్యం’. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలోని హీరో,హీరోయిన్‌ల లుక్స్‌ను విడుదల చేశారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ “ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డేల ఫస్ట్ లుక్‌ను విడుదల చేశాం. వారి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఈ చిత్రంతో ఒక కొత్త శ్రీనివాస్‌ను చూస్తారు. దర్శకుడు శ్రీవాస్ హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌ను రాసిన విధానం చాలా బాగుంది. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది.  ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాలో ఫైట్  సీక్వెన్స్‌లు చాలా కీల కం. అందుకే ఫైట్ మాస్టర్ ఫీటర్ హెయిన్స్ ప్రత్యే క శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తు త షెడ్యూల్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, పూజాహెగ్డేల నడుమ కాంబినేషన్ సీన్స్‌తో పాటు కీలక పాత్రధారులైన జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నె ల కిషోర్‌ల కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం”అని అన్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, బ్రహ్మాజీ, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి, లావణ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఆర్థర్ ఎ.విల్సన్, సంగీతంః హర్షవర్ధన్, మాటలుః సాయిమాధవ్ బుర్రా, యాక్షన్‌ః పీటర్ హెయిన్స్, కళః ఏ.ఎస్. ప్రకాష్, కూర్పుః కోటగిరి వెంకటేశ్వరరావు.

Comments

comments