Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

పిఎన్‌బిలో కుంభకోణం

ind

బ్యాంకు ముంబయి బ్రాంచ్‌లో బయటపడిన రూ.11,400 కోట్ల మేరకు మోసపూరిత లావాదేవీలు
ఇతర బ్యాంకుల ద్వారా విదేశాలకు తరలిన భారీ మొత్తం
ప్రముఖ నగర డిజైనర్ నీరవ్ మోడీ వైపు అనుమానపు ముల్లు

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) ముంబయి బ్రాంచ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.11,400 కోట్లు విలువ చేసే మోసపూరిత లావాదేవీలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బిలియనీర్ నీరవ్ మోడీ, జువెలరీ కంపెనీలపై దర్యాప్తు సంస్థ సిబిఐ ఫిర్యాదులు అందుకుంది. అంతర్జాతీయ సెలబ్రిటీలలో ఒకరిగా నీరవ్ మోడీకి పేరుంది. ఆయనపై తగిన చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే సిబిఐ సిద్ధమైం ది. ఇంతకుముందే పిఎన్‌బి బ్రాంచ్ వద్ద రూ.282 కోట్లు (44 మిలియన్ డాలర్లు) విలువచేసే మోసపూరిత లావాదేవీల ఆరోపణలకు సంబంధించి ఆయన పై సిబిఐ విచారణ జరుపుతోంది. తాజాగా ముంబ యి శాఖలో పలు మోసపూరితమైన, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని స్టాక్ ఎక్ఛ్సేంజి బిఎస్‌ఇకి బ్యాంక్ సమాచారం అందించింది. ఈ మొత్తాన్ని ఖాతాదారులు ఇతర బ్యాంకుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోందని, ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు సమాచారమిచ్చినట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ కుంభకోణం ప్రభావం ఇతర రుణదాతలపైనా పడే అవకాశముందని బ్యాంక్ తెలిపింది. అయితే ఈ మోసానికి పాల్పడిన రుణదాతలు ఎవరు, ఇతర అంశాలను పిఎన్‌బి వెల్లడించలేదు. మోసపూరిత లావాదేవీల విషయంలో ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకుపై విచారణ జరుగుతోంది. పిఎన్‌బిలో 44మిలియన్ డాలర్ల మోసపూరిత లావాదేవీల విషయంలో గత వారం ప్రముఖ నగల డిజైనర్ నీరవ్ మోడీపై సిబిఐ విచారణ చేపడుతోంది. అయితే తాజాగా గుర్తించిన మోసపూరిత లావాదేవీలకు, గతంలోని వాటికి ఏమైనా సంబంధం ఉందా అనే విషయంపైనా స్పష్టత లేదు. తాజా వ్యవహారాన్ని పిఎన్‌బి ఫైలింగ్‌లో వెల్లడించింది కానీ బ్యాంకు ఎగ్జిక్యూటివ్స్ ఎవరూ దీనిపై స్పందించలేదు. ఈ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు బ్యాంకింగ్ సెక్రటరీ వెల్లడించారు. ఇప్పటి వరకు పది మంది పిఎన్‌బి ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ వార్తతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన పిఎన్‌బి షేర్లు స్టాక్‌మార్కెట్లలో భారీగా నష్టపోయాయి. రూ.160 విలువతో బిఎస్‌ఇలో ట్రేడింగ్ ప్రారంభించిన షేరు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8 శాతం పడిపోయింది. ఆఖరికి 10 శాతానికి పైగా షేరు విలువ పడిపోయింది.

Comments

comments