Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

ఎపికి రూ.5వేల కోట్ల కరెన్సీ పంపండి

Chandrababu-Naidu
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షిణమే రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని సిఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్బిఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు లేఖ రాశారు. పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు ప్రస్తుతం ఎపిలో నెలకొన్నాయని, ఎటిఎంలో డబ్బులు లేక ప్రజలు చాలా ఇబ్బందుల ఎదుర్కొంటున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన డబ్బులు కూడా తీసుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని సిఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments