Search
Thursday 24 May 2018
  • :
  • :

అది అందరికీ ఒక కలలాంటిది

cn

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మించిన  చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు మంజుల ఘట్టమనేనితో ఇంటర్వూ… 

మనసులో ఉన్నది చెప్పాలనే…
దర్శకురాలిగా నేను మనసు పెట్టి చేసిన చిత్రం ‘మనసుకు నచ్చింది’. నా మనసులో ఉన్నది చెప్పాలనే ఈ సినిమా తీశాను. నేను నిజాయితీగా చేసిన ప్రయత్నమిది.

వాటిని ఎలా ఆస్వాదించాలి…
ఈ సినిమాలో మంచి ప్రేమ కథ, వినోదం ఉంటాయి. వాటితో పాటే అసలు మనం జీవితంలో చిన్న చిన్న అనుభూతులను ఎలా కోల్పోతున్నాం, వాటిని ఎలా ఆస్వాదించాలి, ప్రకృతితో ఎలా మమేకం కావాలి అనేదే ఈ కథ.

సముద్రంలాంటి సినిమా…
ప్రకృతి ప్రధాన హైలైట్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అది కూడా ఒక హీరోనే. ఇందులోని స్వచ్ఛమైన ప్రేమ కథ అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ‘మనసుకు నచ్చింది’ ఒక సముద్రం లాంటి సినిమా. ఈ సినిమా యువతకు ఒక పండుగలాంటిది. అందరికీ తప్పకుండా నచ్చుతుంది.

అన్నీ చక్కగా సమకూరాకే…
స్క్రిప్ట్ రాయడానికి నాకు సంవత్సరం పట్టింది. ఆతర్వాత సాయిమాధవ్ బుర్రాతో కూర్చొని డైలాగ్స్ రాయించుకోవడానికి ఆరు నెలలు పట్టింది. అన్నీ చక్కగా సమకూరాకే ఈ సినిమాను తెరకెక్కించాము.

అతనే సరైన హీరో…
మొదట కథ రాసుకున్నాను. ఆతర్వాత కొంతమంది హీరోలను కలిసి కథ చెప్పాను కానీ వర్కవుట్ కాలేదు. అనంతరం సందీప్‌కిషన్ దగ్గరకు వెళ్లి కథ చెప్పాను. అతన్ని కలవగానే నా సినిమాకు అతనే సరైన హీరో అనిపించింది.

తప్పకుండా సక్సెస్ అవుతావన్నారు…
డైరెక్షన్ చేస్తాను అనగానే నా భర్త ఎంతగా నో ప్రోత్సహించారు. నాన్న అయితే ఈ విషయం చెప్పగానే ఎంతో ఆశ్చర్యపోయా రు. ఇక బయటి నిర్మాతలు సినిమాను ప్రొ డ్యూస్ చేస్తారని అనగానే ఇంకా థ్రిల్ అయి
తప్పకుండా సక్సెస్ అవుతావని చెప్పారు.

మహేశ్ షాక్ అయ్యాడు…
నేను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తానని చెప్పగానే మహేష్‌బాబు షాక్ అయ్యాడు. డైరెక్షన్ అంటే అంత సులభం కాదని చెప్పాడు. కానీ నా కథ విని, పట్టుదల చూసి ప్రోత్సహించాడు.

దానికి సమయం రావాలి…
మహేశ్‌తో సినిమా చేయాలనే ఉంది. అతనిలాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలనేది అందరికీ ఒక కలలాంటిది. కానీ సమయం రావాలి. మహేష్ పిలిచి సినిమా చేద్దామని అంటే వెంటనే చేస్తాను.

కథ సిద్ధంగా ఉంది…
పవన్‌కళ్యాణ్ కోసం కథ సిద్ధంగా ఉంది. ఒక టాప్ హీరో అన్నింటినీ వదిలేసి జనాలకు సేవ చేద్దామనుకొని రాజకీయాల్లోకి ఎలా వెళ్లాడు అనే అంశం మీదే సినిమా ఉంటుంది. పవన్ ఆ సినిమాకు సరైన హీరో. ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టే సినిమా ఉంటుంది.

Comments

comments