Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

క్రీడల్లో రాష్ట్రాన్ని ముందుంచాలి

jrd

కబడ్డీ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల అందజేత
ముఖద్వారాన్ని ప్రారంభించిన ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్స హిస్తుందని స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్తు, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యా పేట మండలం పిల్లలమర్రిలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వ హించి అనంతరం కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రభు త్వం అంది స్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని జాతీయ స్థాయిలో క్రీడ లలో రాష్ట్రాన్ని ముందుంచాలని ఆ యన ఆకాంక్షించారు. క్రీడల మాన సిక ఉల్లాసానికి, వికాసానికి ప్రతీకగా ఉంటాయని చెప్పారు. క్రీడా కారులు ఉన్నత లక్షాలను ఏర్పాటు చేసుకొని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రం అభివృ ద్ధి పథంలో దూసుకెళ్తుంటే కొం దరు రాజకీయ నాయకులు తమ అధికార లబ్ధికోసం అస త్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం గ్రామీ ణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి అవకాశాలను కల్పించి జాతీయ స్థాయి లో రాణించ డానికి ప్రభుత్వం కృషి చేస్తు ందని వివరించారు. కబడ్డీ ఫైనల్‌లో ఉస్మానియా యూనివర్సిటీ టీమ్‌పై గెలిచిన ఎర్రపహాడ్ జట్టుకు బహుమతి ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి ఎర్రబాడ్, ద్వితీయ బహుమతి చెర్కుపల్లి (తుంగతు ర్తి), తృతీ య బహుమతి ఉస్మానియా యూనివర్సిటీ, చతుర్ధ బహుమతి బండమీది చందుపట్ల, పంచమి కుడకుడ, షష్టి పిల్లలమర్రి వారు క్రీడలలో గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజేతలకు నగదు ను బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమగాని లింగస్వామి, ఉప సర్పంచ్ సుజాత, వెంకట్‌లాల్, చింత వెంకటేశ్వర్లు, చాంద్‌పాష, వీరయ్య, అనిల్ నగదును అందజేశారు.
ముఖద్వారం ప్రారంభం: సూర్యాపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యా లయం వద్ద శ్రీ అన్నపూర్ణ సహిత దేవస్థాన ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి భగవంతుని కృప ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రం థా లయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై.వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కట్కూరి గన్నారెడ్డి, బడుగుల లింగయ్య యాద వ్, మొరిశెట్టి శ్రీనివాస్, కోడిసై దులు, బూర బాలసైదులుగౌడ్, ఆ ల య కమిటీ సభ్యులు ఛైర్మన్ దొండ శ్రీను, గోలీ సుధాకర్, కనపర్తి ప్రభాకర్‌రావు, గండూరి రాధిక, ఛాగంటి ఐయ్య న్న, శీల నర్సింహా రావు, వీరభద్రశర్మ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్‌లో : మండలంలోని శివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని గణపతి పూజ, చంఢీయాగం, రుద్ర హోం, గో పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రోజు మహా శివరాత్రి అని తెలిపారు. అనంతరం గోశాలను ప్రారంభించారు. మండ లంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో బడుగుల లింగయ్య యాదవ్, మంత్రి వ్యక్తిగత అదనపు కార్యదర్శి డిఎస్వీ శర్మ, ఎంపిపి భూక్య పద్మ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments