Search
Friday 25 May 2018
  • :
  • :

పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి

con1

*రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
తలసాని శ్రీనివాసయాదవ్
మనతెలంగాణ/జగిత్యాల:రాష్ట్రంలో పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి పశు సంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా,ఉన్నతాధికారులతోకలిసిజిల్లా కలెక్టర్లతో గొర్రెల అభివృద్ధి పథకం,మత్స శాఖలపై సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసయాదవ్‌మాట్లాడుతూ,రాష్ట్రంలో రూ.5వేల కోట్ల వ్యయం అంచనాతో గొర్రెల అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టామ ని,ఇప్పటి వరకు రూ.2206కోట్లు వెచ్చించి 289489 గొర్రెల యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్లు తెలిపారు. కొన్ని జిల్లాల్లో మొదటి విడత లక్షం వంద శాతం పూ ర్తయిందన్నారు.గొర్రెలకు పశుగ్రాసం ఇబ్బందులు త లెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.వేసవికాలంలోఇబ్బందులు లేకుండా చూ డాలన్నారు.ఉద్యానవన,నీటి పారుదల శాఖలు పూర్తి సహకారం అందించాలని సూచించారు. పశుగ్రాసం ను స్వంత భూములున్న రైతుల వద్దకు మొబైల్ వాహనంతో సరఫరా చేయాలన్నారు.వ్యాధి నివారణ టీకా లు,నట్టలమందులు సకాలంలో అందేలా ఎప్పటికప్పు డు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 1962పశు సంచార వైద్యశాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్నారు.నియోజకవర్గానికి మూడు చొప్పున సంతలు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్య లు తీసుకోవాలన్నారు.చనిపోయిన గొర్రెలకు బీమా సొమ్ము మొత్తం అందేలా చూడాలని,గొర్రెల కాపరులకు ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని ప్రభుత్వం లక్ష రూపాయల నుంచి రూ.6 లక్షలకు పెంచిందని, పాత క్లెయిమ్‌లు ఉంటే వెంటనే అందజేసేందుకు అధికారులు చ ర్యలు చేపట్టాలన్నారు.గొర్రెల పంపిణీ పథకం ముఖ్యమంత్రి మానసపుత్రిక కార్యక్రమమని, దీన్ని విజయవంతంచేసి రైతులకు ధైర్యం కల్పించాలన్నారు. రా ష్ఠ్రంలోచేపల మార్కెట్‌ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలన్నారు. గత సంవత్సరం నీటి వనరుల వద్ద 51కోట్ల చేప పిల్లలను ఉచితంగా విడుదల చేశామని, ఈ సంవత్సరం 80వేలకోట్ల చేప పిల్లల విడుదల చేయాలని ల క్షంగా పెట్టుకున్నామన్నారు.
రాబోయే రోజుల్లో సుమారు రూ. 5వేల కోట్ల విలువ గల చేప సంపద ఉత్పాదన జరగాలన్నారు.నీటి వనరు ల లభ్యతలో రాష్ట్రం దేశంలో మూడవ స్థానంలో ఉం డగా, చేపల ఉత్పత్తిలో 8వ స్థానంలో ఉందన్నారు. ఉ త్పత్తిలో రాష్ట్రాన్ని మూడవ స్థానంలోకి తీసుకువచ్చేందుకుఅధికారులుకృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 500 పైన మత్సకారుల కమ్యూనిటీ హాళ్లకు అనుమతులు ఇవ్వగా 179చోట్ల ఇంకా పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. 48మార్కెట్లు మంజూరు కాగా 28 మా ర్కెట్లకు స్థల కేటాయింపులు జరగాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. త్వరితగతిన స్థల కేటాయింపులు చేసి పనులు ప్రారంభించాలన్నారు. 2016-17లో 8 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేశామని, 2017-18లో 18 కోట్ల లక్షంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటేడ్ ఫిషరీస్ డెవలప్‌మెంట్‌కు జిల్లాలకు ల క్షాలను నిర్దేశించామని, ఇచ్చిన లక్షాన్ని సాధించాలన్నారు.అధికారులు పట్టుదలంతో పని చేసి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విజయవ ంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జెసి రాజేశం మాట్లాడుతూ, మొదటి విడత గొర్రెల గ్రౌండిగ్ జిల్లాలో పూర్తి అయిందని, పశుగ్రాసానికి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. 500 ఎకరాల్లో పశుగ్రాస ఉత్పత్తికి ప్రణాళి క చేశామని, 319 ఎకరాలు ఇప్పటికే గుర్తించి చర్యలు చేపట్టామని,మరో 200 ఎకరాలకు ప్రణాళిక చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శా ఖాధికారి డాక్టర్ అశోక్‌రాజ్,జిల్లా మత్స శాఖాధికా రి రాణాప్రతాప్,జిల్లా ఉద్యానవన శాఖాధికారి ప్రతాప్‌సింగ్,ఎపిడి లక్ష్మీనారాయణ,వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌లు,అధికారులు పాల్గొన్నారు.

Comments

comments