Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

అనిరుధ్ స్థానంలో తమన్

tmn

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రం నిరాశపరచడంతో త్రివిక్రమ్ నెక్స్ సినిమా ఆలస్యమవుతుందా అనే అనుమానాలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి ఆసక్తిగానే ఉన్నాడు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. అయితే సినిమా యూనిట్‌లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అకస్మాత్తుగా ఇద్దరు టెక్నీషియన్స్‌ను మార్చడంతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి ముందుగా ఎంపిక చేసిన అనిరుధ్‌ను కాదని తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికచేశారు. ఎన్టీఆర్ సూచన మేరకు అతన్ని తీసుకున్నారని సమాచారం. తమన్ ఇటీవల మంచి సంగీతాన్ని అందిస్తూ హిట్స్ కొట్టేస్తున్నాడు. మ్యూజిక్‌పరంగా ఈ సినిమాకు ఎంతో ప్రాధాన్యత ఉండనుందట. ఇక సినిమాటోగ్రాఫర్ నటరాజ్ కూడా తప్పుకున్నాడు. అతని స్థానంలో ఏ.ఎస్.ప్రకాష్‌ను తీసుకున్నారు. ఈ రెండు మార్పులు తప్పితే ఈ ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవు. ముందుగా అనుకున్న విధంగానే మార్చి 26న ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

Comments

comments