Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

నేడు ఇరాన్ అధ్యక్షుడు రాక

ph03

మన తెలంగాణ/ హైదరాబాద్: రెండు రోజుల పర్యటన ని మిత్తం ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ హసన్ రౌహనీ గురువారం హైదరాబాద్ వస్తున్నా రు. ఆయన పర్యటనకు ఎలాంటి ఇబ్బందు లు, ఆటంకాలు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ఇరాక్ అధ్యక్షుని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయ న సమన్వయ సమావేశం నిర్వహించారు. డాక్టర్ హసన్ రౌహనీ పర్యటన సందర్భంగా తగు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్, స్వాగతించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. హసన్ రోహనీని స్వాగతించడానికి గాను కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.పి.సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. శుక్రవారం ఆయన సాలర్ జంగ్ మ్యూజియం, మక్కా మజీద్‌లను సదర్శిస్తారని తెలిపారు. ఇరాన్‌కు హైదరాబాద్‌కు సత్సంబంధాలు ఉన్నాయని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అధ్యక్షులు డాక్టర్ హసన్ రౌహనీ హైదరాబాద్ పర్యటించడం విశేషం అని, వారికి ఆహ్వానం పలకడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గొప్ప అవకాశమన్నారు. హైదరాబాద్ నగరంలోని ఇనాన్ కాన్సులేట్ జనరల్ మహమ్మద్ హఘ్‌బిన్ ఘోమీ మాట్లాడుతూ తమ దేశాధ్యక్షుని పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్షుని పర్యటనలో 21 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానియన్లతో కూడా ఆయన సమావేశమౌతారని తెలిపారు. ఈ సమావేశంలో జిఎడి ముఖ్య కార్యదర్శి అధర్‌సిన్హా, నగర పోలీసు కమిషనర్ వివి శ్రీనివాస్‌రావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన కిషోర్, కలెక్టర్ యోతారాణా, ఇంటలిజెన్స్ ఐజి నవీన్‌చంద్, అదనపు డిజి అంజనీకుమార్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

comments