Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి

cong

మనతెలంగాణ/హుజూర్‌నగర్‌ః కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని టిపి సిసి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.   బుధవారం పట్ట ణం లోని 17వ వార్డులో రూ. 20 లక్ష ల రూపాయలతో నిర్మా ణా లు చేపట్టిన వివిధ అభివృద్ధి పను లకు శంకుస్థ్ధాపన చేశారు.  ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్లతో ఆయ న మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుచేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిం దన్నా రు.   ఎమ్మెల్యే అయిన తరువాత హు జూర్ నగర్ రూపురేఖలు మార్చానన్నారు.  తాను మంత్రిగా  ఉన్నప్పుడు పట్ట ణంలో 90 శా తం సీసీ రోడ్లను నిర్మించడం జరిగిం ద న్నారు. ఫణిగిరి శ్రీసీతారామచంద్ర స్వా మి గట్టు వద్ద సుమా రు రూ. 250 కోట్లతో నిర్మాణాలు చేపట్టిన ఇండ్లను పూర్తి చేసి నిరుపేదలకు అందించాలన్నారు. 2019 లో జరిగే సార్వత్రిక ఎన్ని కల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం కాయమన్నా రు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియూసి రాష్ట్ర ప్రధా న కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు, వార్డు కౌన్సి లర్ తన్నీరు మల్లి కార్జున్ రావు, చిట్యాల అమర్ నాధ్ రెడ్డి, సుతారి వేణుగో పాల్, కుక్కడపు  మహేష్ పాల్గొన్నారు.

Comments

comments