Search
Thursday 24 May 2018
  • :
  • :

దుబాయ్‌లో తొలి హిందూ ఆలయానికి శంకుస్థాపన

MODI

దుబాయ్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లో తొలి హిందూ ఆలయానికి ప్రధాన నరేంద్రమోడీ ఆదివారం శంకుస్థాపన చేశారు. బోచసాన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం మోడీ దుబాయ్‌లోని ఒపెరా హౌస్‌లో ప్రవాస భారతీయలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో మోడీ ప్రసంగించారు. హిందూ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చిన దుబాయ్ యువరాజుకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ నుంచి వచ్చిన 30 లక్షల మంది ప్రజలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కలిపిస్తున్నాయని ఆయన చెప్పారు. తాను శంకుస్థాపన చేసిన ఆలయం వసుదైక కుటుంబం అనే సందేశాన్ని ఇస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రపంచ వ్యాప్తంగా భారత్ ర్యాంకు 142 నుంచి 100కి చేరడం సంతోషకర విషయమని ఆయన వెల్లడించారు. దీన్ని మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని, భారతీయుల కలలను సాకారం చేస్తామని ప్రధాని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి సంస్కరణలపై కూడా ఆయన మాట్లాడారు.

The foundation stone of the first Hindu temple in Dubai

Comments

comments