Search
Tuesday 20 February 2018
  • :
  • :
Latest News

బంగారు తెలంగాణానే ధ్యేయం

jg

* మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్/అర్బన్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడమే ధ్యేయమని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. మంగళవారం మావల పంచాయితీ పరిధిలోని రాంనగర్‌లో హనుమాన్ మందిర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పర్చుతున్నామన్నారు. గత పాలకులు ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారికి చేసిందేమి లేదన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, సర్పంచ్ రఘుపతి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, వైస్ ఎంపిపి గంగారెడ్డి, నాయకులు ఖయ్యుం, అశోక్, నాగరాజుగౌడ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.
యాదవ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి…
జిల్లా కేంద్రంలోని యాదవ సంఘ భవనంలో మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న యాదవ సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్బంగా మంత్రి రామన్న మాట్లాడుతూ యాదవ కులస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం వారికి రాయితీ గొర్రెలను అందిస్తు ఆర్థికంగా ఎగిగేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు. రాయితీతో కూడిన రుణాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారన్నారు. యాదవులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వం ప్రణాళికతో వారి అభివృద్దికి ముందుకు సాగుతుందన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని కుల వృత్తుల వారికి కార్పొరేషన్ ద్వారా రుణాలను ఇచ్చేందుకు నిధులను కేటాయించిందన్నారు. రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరే రాజన్న, గ్రంధాలయ చైర్మన్ మనోహర్, మావల సర్పంచ్ రఘుపతి, అడ్డిభోజారెడ్డి, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments