Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

కైకాలకు విశ్వవిఖ్యాత నటసామ్రాట్ బిరుదు ప్రదానం

kikla

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వవిఖ్యాత నటసామ్రాట్ బిరుదును ప్రదానం చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ తీరంలో శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర  సరస్వతి  ఆధ్వర్యంలో జరిగిన మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, టి.సుబ్బరామిరెడ్డి, ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపి మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావుల చేతుల మీదుగా సత్యనారాయణకు బిరుదుతో పాటు బంగారు కంకణాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ “సినీ రంగంలో కైకాల సత్యనారాయణ చేసిన విశేష కృషికి ఈ బిరుదుతో సన్మానించాము. నాలుగు దశాబ్దాల సినీ పయనంలో 780 చిత్రాల్లో ఆయన నటించారు. ఆయనను చూసి నేటి తరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది”అని చెప్పారు. బాలకృష్ణ మాట్లాడుతూ “కళాకారులను ప్రోత్సహించడంలో సుబ్బరామిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. కైకాల సత్యనారాయణ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఓ గొప్ప నటుడు”అని తెలిపారు. కైకాల సత్యనారాయణ మాట్లాడుతూ “ప్రభుత్వం ఇచ్చిన అవార్డుల కంటే ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. సుబ్బరామిరెడ్డి గొప్ప మనసున్నవాడు. సినీ, నాటక,కళా, విద్యా, సామాజిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఆయన అవార్డులను అందచేస్తూ ప్రోత్సహిస్తున్నారు”అని అన్నారు.

Comments

comments