Search
Sunday 25 February 2018
  • :
  • :
Latest News

చిరంజీవి చూసి షాకయ్యారు

tpవరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తొలి ప్రేమ’. ఎస్‌విసిసి బ్యానర్‌పై బాపినీడు సమర్పణలో బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా సినిమా థాంక్స్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “ఈ సినిమాను నమ్మి చేశాను. ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్ అయ్యారు”అని పేర్కొన్నారు.  దిల్‌రాజు మాట్లాడుతూ “అప్పట్లో పవన్‌కళ్యాణ్‌తో కరుణాకరన్ ‘తొలిప్రేమ’ను రూపొందిస్తే.. ఇప్పుడు వెంకీ అట్లూరి అదే టైటిల్‌తో ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించాడు. ‘ఫిదా’ తర్వాత వరుణ్‌తేజ్ ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. మూడు పాత్రల్లో తను చూపించిన వైవిధ్యం అందరినీ మెప్పించింది”అని అన్నారు. చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ “దర్శకుడిగా నా తొలి ప్రయత్నాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు. రాశీని ఈ సినిమాలో చూసిన వారందరూ ఇంట్లో అమ్మాయిలా ఇష్టపడుతున్నారు. వరుణ్ నమ్మడం వల్లే ఈ సినిమా తెరకెక్కింది”అని చెప్పారు. హీరో వరుణ్‌తేజ్ మాట్లాడుతూ “ఈ సినిమా కథను అందరూ నమ్మి చేశారు. వెంకీ చాలా ఇష్టపడి రాసిన కథ ఇది. చిరంజీవి ఈ సినిమా చూసి షాక్ అయ్యారు. కొత్త దర్శకుడు ఇంత బాగా చేశాడా అని అన్నారు. సినిమాలో నాతో రాశీఖన్నా కెమిస్ట్రీ చాలా బావుందని అందరూ అంటున్నారు”అని తెలిపారు. హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ “ఈ సినిమాకు వచ్చిన రివ్యూలన్నీ చదివాను. ట్విట్టర్‌లోనూ నన్ను వర్ష అని పిలుస్తున్నారు. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, స్వప్న, విద్యుల్లేఖా రామన్, బాపినీడు, జార్జి, హైపర్ ఆది, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments