Search
Friday 25 May 2018
  • :
  • :

రెండు మనసుల మధ్య ఏం జరిగింది?

Niharika

స్టార్ హీరోయిన్ అనుష్కతో ‘భాగమతి’లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించిన యువి క్రియేషన్స్… పాకెట్ సినిమాతో కలిసి నిర్మిస్తున్న సినిమా ‘హ్యాపి వెడ్డింగ్’. సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న ఈ చిత్రం లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నారు. వేసవిలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. లక్ష్మణ కార్య ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడు. సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించారు.  పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా మా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రతి పాత్రను తీర్చిదిద్దడం జరిగింది. ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాము”అని అన్నారు. నరేష్, మురళీశర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరాః బాల్ రెడ్డి.

Comments

comments