Search
Friday 25 May 2018
  • :
  • :

దేవాలయాల అభివృద్ధికి కృషి

god2

*అన్నదానంలో పాల్గొన్న పోచారం
*సోమలింగేశ్వరాలయానికి కోటి నిధులు
*స్వామి వారికి మంత్రి పూజలు

మన తెలంగాణ/బాన్సువాడ : దేవాలయాల అభివృద్ధి కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అధునాతనమైన ఆలయాల మనుగడ కోసం ప్రత్యేక శ్రద్ధ్ద చూపుతున్నామని రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి పోచారం బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామ సోమలింగేశ్వరాలయాన్ని సం దర్శించారు. ఆయన గర్భగుడిలో స్వామి వారికి జలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానంలో పాల్గొన్నారు. సోమలింగేశ్వరాలయం కో సం కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు ప్ర కటించారు. అట్టి నిధులతో ఆలయంలో నేలపై టైల్స్‌ను ఏ ర్పాటు చేయాలని, అదే విధంగా పాత గోడలను తొలగించి కొత్త గోడలను నిర్మించాలని చెప్పారు. పాత ప్రాకారాల స్థానం లో శాస్త్రోక్తంగా కొత్త ప్రాకారాలను నిర్మించాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు రహదారిని డబుల్ రోడ్డుగా మార్చాలని చె ప్పారు. మరింత ప్రగతి కోసం మరిన్ని నిధులను కే టాయించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. మంత్రితో పాటు నాయకులు అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బద్యానాయక్, ఎజాజ్, కిషోర్ యాదవ్, శ్యామల, మోహన్ నాయ క్, బుల్లెట్ రాజు,గుండ్ల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

Comments

comments