Search
Wednesday 20 June 2018
  • :
  • :

9 మంది జవాన్లు బలి

ph

గాయపడిన మరి ఆరుగురు
కూంబింగ్ వాహనంపై మందుపాతర పేల్చి కాల్పులు జరిపిన మావోయిస్టులు

మన తెలంగాణ/ హైదరాబాద్/ఖమ్మం : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని గొల్లపల్లి-కిష్టారం ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్‌పిఎఫ్ జవాన్ల (కోబ్రా) వ్యాన్‌పై మావోయిస్టు లు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 9 మంది జవాన్లు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు తెలిపా రు. వ్యాన్‌ను పేల్చిన తరువాత కూడా మావోయిస్టులు పోలీసుల పై కాల్పులకు తెగబడ్డారని, కొద్దిసేపటి వరకు రెండువైపుల నుంచి కాల్పులు కొనసాగాయని పేర్కొన్నారు. మృతుల్లో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుళ్లు అజయ్ కెఆర్ యాదవ్, మనోరాజన్ లంక, జితేంద్రసింగ్, షోబిత్ శర్మ, మనోజ్ సింగ్,దర్మేంద్రసింగ్, చంద్రా, హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మణ్ ఉన్నట్లు తెలిపారు. వీరి మృతదేహాలను హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన జవాన్లను రాయ్‌పూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో వంద మంది మావోయిస్టులు పాల్గొనట్టు తెలుస్తుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో కూంబింగ్ నిర్వహిస్తున్న 208 బెటాలియన్‌కు చెందిన కోబ్రా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చారని, ఆ తర్వాత కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయారని, మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో కిష్టారం, పాలోడి గ్రామాల మధ్య 212 బెటాలియన్‌కు చెందిన కోబ్రా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ నెల 2న తెల్లవారు జామున తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అటవీ ప్రాంతమైన పూజార కాంకేర్ జిల్లా సమీపంలోని ఊసురు పోలీసు స్టేషన్‌కు 25 కి.మీ దూరంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మావోయిస్టులు, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందిన తర్వాత ఇప్పుడు మందుపార పేల్చి కోబ్రా బలగాలపై ప్రతిఘటనకు పాల్పడడం గమనార్హం.

Comments

comments