Search
Friday 20 April 2018
  • :
  • :

రహస్యంగా ప్రియుడిని పెళ్లాడిన శ్రియ…!

Shriya

ముంబయి: సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ పెళ్లి ఈ నెలలోనే రహస్యంగా జరిగినట్టు సమాచారం. ముంబయిలోని ఇంట్లో ఈ నెల 12న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రియుడిని  శ్రియ పెళ్లాడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రష్యా క్రీడాకారుడు, వ్యాపావేత్త అయిన ఆండ్రీ కొశీవ్‌తో శ్రియ వివాహం జరిగిపోయిందట. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శుభకార్యం ఘనంగా జరిగిందని సమాచారం. ఈ పెళ్లికి బాలీవుడ్ నుంచి మనోజ్ భాజ్‌పాయ్, షబానా అజ్మీ హాజరైనట్లు తెలుస్తోంది. 11వ తేదీన పెళ్లికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారట. శ్రియా గులాబి రంగు చీరలో పెళ్లి కూతురిగా మెరిసిపోయారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఆండ్రీ, శ్రియా చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ శ్రియా ఎప్పుడూ ఈ విషయం గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇక ఈ నెలలోనే ఉదయ్‌పూర్‌లో శ్రియ పెళ్లి అని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే  శ్రియతో పాటు ఆమె తల్లి ఆ వార్తల్లో వాస్తవం లేదని, పెళ్లికి ఇంకా చాలా సమయం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా వివాహం జరిగిపోయినట్టు వార్తలు వస్తుండడంతో శ్రియా ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా, ఇప్పటి వరకు శ్రియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Comments

comments