Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌టెల్ రూ.16,500 కోట్లు సమీకరణకు ఆమోదం

airtel

ముంబై: విదేశీ బాండ్లు, ఎన్‌సిడి(నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్స్) ద్వారా రూ.16,500 కోట్లు సమీకరించే ప్రతిపాదనకు సోమవారం ఎయిర్‌టెల్ బోర్డు ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్ రుణాలతో సహా నిర్వహణ కోసం ఈ నిధులను సమీకరించనున్నట్టు సంస్థ తెలిపింది. రిలయన్స్ జియో నుంచి గట్టి పోటీ ఎదురవడంతో ఇటీవల ఎయిర్‌టెల్‌కు లాభాలు తగ్గిపోయాయి. ఈనేపథ్యంలో ఎయిర్‌టెల్ కంపెనీ నిధుల సమీకరణ ద్వారా కంపెనీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్‌సిడిల జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు కంపెనీ చేసిన ప్రతిపాదనకు బోర్డు అనుమతి లభించడంతో స్టాక్‌మార్కెట్లో ఎయిర్‌టెల్ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 5.21 శాతం పెరిగి రూ. 423 వద్ద స్థిరపడింది. ప్రయివేట్ ప్లేస్‌మెంట్ కింద వివిధ దశలలో ఎన్‌సిడిల జారీ ద్వారా రూ.10 వేల కోట్లను సమీకరించేందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు నిధుల సమీకరణకు అనుమతి లభించిందని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. అంతేకాకుండా ఎఫ్‌సిసిబిల ద్వారా 100 కోట్ల డాలర్లు (రూ. 6500 కోట్లు) సమీకరించేందుకు బోర్డు అంగీకరించినట్లు వెల్లడించింది.

Comments

comments