Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కేంద్రంపై మండిపడిన చంద్రబాబు

NC-BABU

అమరావతి : ఎపి అసెంబ్లీ వేదికగా సిఎం చంద్రబానాయుడు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదాతో ఎటువంటి ప్రయోజనం ఉండదని, దానికంటే ఎక్కువగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన కేంద్రం చివరకు ఎపికి మొండి చేయి చూపించిందని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఐదేళ్ల కాలానికి ప్రజలు అధికారమిచ్చారని, నాలుగేళ్లు పూర్తైనప్పటికీ, కేంద్రం ఎపికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన అన్నారు. చివరి కేంద్ర బడ్జెట్‌లో కూడా ఎపికి ఏమీ కేటాయించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో విభజన హామీల ఊసేలేదని పేర్కొన్నారు. ఎపికి తీరని అన్యాయం జరిగిందని ఎన్నికల సమయంలో చెప్పిన నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి మరింత అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తమ రాష్ట్రంలో అడ్రస్సు లేకుండా పోయిందని, ఎపికి న్యాయం చేకపోతే బిజెపికి కూడా అదే గతి పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

AP CM Chandrababu Comments on Central Govt

Comments

comments