Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఖలిదా జియాకు బెయిల్

ZIA

ఢాకా : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలిదా జియాకు నాలుగు నెలలకు గాను బెయిల్ లభించింది. ప్రస్తుతం ఆమె బంగ్లాదేశ్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఓ చిన్నారుల స్వచ్ఛంద సంస్థకు వచ్చిన అంతర్జాతీయ నిధులను జియా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ ఇటీవల ఢాకా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఆమెకు ఐదేళ్ల శిక్షను కోర్టు విధించింది. ఇదే కేసులో ఆమె కొడుకు తారిక్ రెహ్మాన్‌కు ఢాకా కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు ఖలిదా జియా చెబుతున్నారు. కోర్టు తీర్పుతో ఆమె ఈ ఏడాది జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు దూరమయ్యారు. జియాపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాకు చాలా ఏళ్లుగా ఆమె ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న విషయం తెలిసిందే.

Bail Granted to Bangladesh Ex PM Khaleda Zia

Comments

comments