Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ఈ ఏడాదిలోనే బంగార్రాజు

nag

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఎంత హిట్ అయిందో ఆ సినిమాలో బంగార్రాజు పాత్ర అంత పాపులర్ అయింది. అప్పట్లోనే నాగార్జున చెప్పేశాడు బంగార్రాజు పాత్రతో సినిమా చేస్తానని. ఇక ఈ చిత్ర దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ అన్నపూర్ణ బ్యానర్‌కు రెండు హిట్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాదిలోనే ఎలాగైనా ‘బంగార్రాజు’ సినిమా పూర్తి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నాడట. ప్రస్తుతం రవితేజ హీరోగా కళ్యాణ్‌కృష్ణ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఆయన ‘బంగార్రాజు’ సినిమాపై దృష్టిపెడతాడు. అలాగే నానీతో కలిసి మల్టీస్టారర్‌ను పూర్తిచేసిన తర్వాత నాగార్జున ఈ చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘బంగార్రాజు’ చిత్రాన్ని పూర్తిచేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది. నాగార్జున ఆలోచన  తెలిసింది. అదే సమయంలో ఈ ఏడాది చివరలో అన్నపూర్ణ బ్యానర్‌లో నాగచైతన్య హీరోగా ఓ సినిమాను ప్రారంభిస్తాడట నాగార్జున. ఆయన నిర్మించే ఈ చిత్రాన్ని ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తాడు. అంటే వచ్చే ఏడాది అన్నపూర్ణ బ్యానర్‌లో రెండు సినిమాలు విడుదలవుతాయన్న మాట.

Comments

comments