Search
Wednesday 20 June 2018
  • :
  • :

బంగ్లాదేశ్ టార్గెట్ 177

Rohit-Sharma

కొలంబో: వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీయ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ 89(61 బంతులు: 5ఫోర్లు, 5సిక్సర్లు) పరుగులతో రాణించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 35 పరుగులు చేశాడు. సురేష్ రైనా మరోసారి విజృంభించాడు. 30 బంతుల్లో 5 బౌండరీలు, రెండు సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశాడు. రోహిత్,రైనా, శిఖర్ చెలరేగడంతో భారత్ 176 పరుగులు చేసింది. దీంతో బంగ్లా ముందు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రూబెల్ హుస్సెన్ కు రెండు వికెట్లు దక్కాయి.

Comments

comments