Search
Wednesday 20 June 2018
  • :
  • :

మూడు చోట్లా బిజెపికి ఘోర పరాజయం!

yogi

  • గోరఖ్ పూర్, ఫూల్పూర్ లలో సమాజ్ వాది ఘన విజయం
  • బిహార్ అరారియా లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న ఆర్జేడీ కైవసం
  • ఒక అసెంబ్లీ స్థానాన్ని గెలుపొందిన బిజెపి

పాట్నా,లక్నో: బీహార్, ఉత్తరప్రదేశ్ లలో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురుగాలి వీచింది. బీహార్ లో జరిగిన ఒక లోక్ సభ, రెండు రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో లాలూ ప్రసాద్ యాదవ్ సారధ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి) ఒక లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఒక అసెంబ్లీ స్థానాన్ని సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై బిజెపి గెలుచుకుంది.
ఉత్తరప్రదేశ్ లోని ఫూల్పురా లోక్ సభ స్థానంలో సమాజ్ వాది పార్టీ ఘన విజయం సాధించింది. సమీప బిజెపి అభ్యర్థిపై సమాజ్ వాది పార్టీ అభ్యర్థి నాగేంద్రసింగ్ 59,613 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. యుపి ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ కు కంచుకోట అయిన గోరఖ్ పూర్ నియోజక వర్గంలో జరిగిన ఎన్నికలో ఎస్పీ అభ్యర్థి 21వేలకుపైగా ఓట్లతో గెలుపొందారు. కాగా, బిజెపి రెండు సిట్టింగ్ స్థానాల్లో ఓటమి పాలైంది. బీహార్ అరారియా లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలో సమీప బిజెపి అభ్యర్థిపై ఆర్జేడీ అభ్యర్థి 57,358 భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో అభ్యర్థులు రెండు లోక్ సభ స్థానాల్లోనూ డిపాజిట్ కోల్పోయారు.

Akhilesh-Yadav

Tejashwi-Yadav

Comments

comments