Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

ప్రధాని కాన్వాయ్‌పై బాంబు దాడి

RAMI

గాజా : పాలస్తీనా ప్రధాని రమి హమదల్లా కాన్వాయ్‌పై బాంబు దాడి జరిగింది. గాజా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. అయితే ప్రధానికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కాన్వాయ్‌లోని మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. మిలిటెంట్, పొలిటికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ హమస్ ఆధీనంలో ఉన్న గాజా ప్రాంతానికి ప్రధాని రమి హమదల్లా రావడం చాలా అరుదని అధికారులు తెలిపారు. ఈ గ్రూప్‌కు చెందిన వారే ప్రధాని కాన్వాయ్‌పై దాడి చేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం రమి హమదల్లా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటువంటి సంఘటనలు పాలస్తీనా ఐక్యతను దెబ్బతీయలేవని హమదల్లా స్పష్టం చేశారు.

Bomb Attack on Prime Minister Convoy

Comments

comments