Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

లోయలో పడిన బస్సు : 38 మంది మృతి

BUS

అడిస్ అబబా : ఇథియోపియాలో మంగళవారం ఉదయం ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 38 మంది మరణించారు. మృతుల్లో 28 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. అమ్‌హరా రాష్ట్రంలోని లిగాంబో జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు.

Bus fell into the Valley : 38 People were Killed

Comments

comments