Search
Wednesday 20 June 2018
  • :
  • :

హీరోయిన్ హన్సికపై చీటింగ్ కేసు

hansika
చెన్నై: హీరోయిన్ హన్సికపై చెన్నైలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. హన్సిక తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ఆమె మేనేజర్ మునుస్వామి నడిగర్ సంఘంలో(తమిళ నటీనటుల) ఫిర్యాదు చేశాడు. హన్సికకు సంబంధించిన డేట్స్, పారితోషికం వంటి విషయాలను ఆమె మేనేజర్ మునుస్వామి చూసుకునేవాడు. ప్రస్తుతం హన్సికకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె తల్లే చూసుకుంటుంది. కాగా మేనేజర్‌గా తనను తీసేసిన తర్వాత కూడా ఇవ్వాల్సిన బ్యాలెన్స్ మొత్తాన్ని ఇవ్వకుండా హన్సిక, ఆమె తల్లి ఇబ్బంది పెడుతున్నారని ఆయన నడిగర సంఘంలో ఫిర్యాదు చేశారు. తనకి ఇవ్వాల్సిన డబ్బుకు సంబంధించిన అన్నీ రుజువులు తన దగ్గర ఉన్నాయని మునుస్వామి మీడియాకి తెలపాడు. ఈ విషయంపై ఇప్పటి వరకు హన్సిక స్పందించకపోవడంతో మునుస్వామి వాదనకు బలం చేకూరినట్లు అయ్యింది. అయితే హన్సిక మునుస్వామికి ఫోన్ చేసి మొత్తం డబ్బు చెల్లిస్తానని, కేసు వాపస్ తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

Comments

comments