Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మూకుమ్మడి రాజీనామాలకు సిఎల్‌పి నిర్ణయం

K.JANAREDDY

హైదరాబాద్ : ప్రతిపక్షం గొంతునొక్కేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిఎల్‌పి నేత కుందూరు జానారెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఆయన అభివర్ణించారు. సోమవారం అసెంబ్లీలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ కాంగ్రెస్ సభ్యులను శాసనసభ, మండలి నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. అనంతరం సిఎల్‌పి సమావేశం జరిగింది. తమపై సస్పెన్షన్ వేటు పడడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా పరిగణించారు. అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. దాడి ఘటనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సభ్యుల సంజాయిషీ తీసుకోకుండా ఏకపక్షంగా తమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. సభ తీసుకున్న నిర్ణయంపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నామని ఆయన వెల్లడించారు. సభలో ప్రతిపక్ష నేతనైన తనను, మండలిలో ప్రతిపక్ష నేత అయిన షబ్బీర్ అలీని సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన చెప్పారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూకుమ్మడిగా ఎంఎల్‌ఎ పదవులకు రాజీనామా చేయాలని వారు నిర్ణయం తీసుకున్నారు. మూకుమ్మడి రాజీనామాలకు ఎఐసిసి అనుమతి కోరాలని సిఎల్‌పి దృఢంగా నిశ్చయించుకుంది.

CLP Decision for Resignations

Comments

comments