Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారు : కెసిఆర్

KCR

హైదరాబాద్ : నాలుగేళ్లుగా కాంగ్రెస్ నేతలు తనపై విషప్రచారం చేస్తున్నారని తెలంగాణ సిఎం కెసిఆర్ ధ్వమెత్తారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలకు ఇంత రాజకీయ అసహనం పనికి రాదని ఆయన పేర్కొన్నారు. అరాచక శక్తుల పీచమణచడంలో ప్రభుత్వం దేనికైనా వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నేతల ముసుగులో కాంగ్రెస్ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని, వారి అరాచకాలను సహించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసందే. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తాకి గాయమైంది. దీంతో మంగళవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్‌ఎ సంపత్‌కుమార్ ఎంఎల్‌ఎ సభ్యత్వాలను రద్దు చేశారు. మిగిలిన కాంగ్రెస్ సభ్యులను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. శాసనమండలిలో కూడా కాంగ్రెస్ ఎంఎల్‌సిలను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో కెసిఆర్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కాంగ్రెస్ సభ్యుల విషయంలో తీసుకున్న నిర్ణయం కఠినమైనదేనని, కానీ వారిపై చర్యలు తప్పడం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు సభ లోపల, బయట ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చేటని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతల వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని కెసిఆర్ చెప్పారు.

CM KCR Comments on Congress Leaders

Comments

comments