Search
Wednesday 20 June 2018
  • :
  • :

ఆశయాలకు అనుగుణంగా సమగ్రాభివృద్ధి

amra

*జిల్లా కేంద్రాల్లోని పార్క్‌లు, గ్రేవ్‌యార్డ్‌లు అభివృద్ధి చేయాలి
*రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: రాష్ట్రంలోని అర్బన్ లోకల్ బాడిస్ గల 74 జిల్లా, పట్టణ కేంద్రాలను పట్టణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమగ్రంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అందు నిమిత్తం ప్రభుత్వం జిఒ నెం.51ని రూపొందించడం జరిగిందని ఐటి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లా, పట్టణ కేంద్రాల్లో చేపట్టాల్సిన ఇన్నోవేటివ్ పనులను సూచిస్తూ అందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరితగతిన ప్రభుత్వానికి పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను మంత్రి కోరారు. రానున్న రోజులలో 145 మున్సిపాలిటీలు లోకల్ బాడీస్‌గా గు ర్తింపు పొందనున్నాయని 33 నుంచి 34 లక్షల మంది జనాభా సుమారు తెలంగాణలో 45 శాతం జనాభా ఈ మున్సిపాలిటీలలో భాగస్వాములు కానున్నారని ఈ క్రమంలో నూతన దృక్పథంతో ప్రజల అభిరుచికి అనుగుణంగా అభివృద్ధి పనులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రాన్ని విజిబుల్ ఇంపాక్ట్ ఉండే విధంగా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా మౌళిక సదు పాయాలతో పాటు జంక్షన్ల అభి వృద్ధి, పబ్లిక్ పార్క్‌లు, గ్రేవ్ యార్డ్‌లు, ఓపెన్ ఆడిటోరియం నిర్మాణం, లేక్ బ్యూటిఫికేషన్, గ్రీనరీ అదేవిధంగా శాస్త్రీయ పద్ధతిలో బస్‌బేల నిర్మాణం వంటి పనులను సృజనాత్మకతతో చేపట్టి పట్టణాలను సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. పట్టణ సమీపంలో ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే బ్లాక్ ప్లాం టేషన్ చేపట్టి అందులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలన్నారు. అధికారులు పనుల ప్రతిపాదనలు రూపొందించే ముందు పబ్లిక్ హెల్త్, స్థానిక మున్సిపల్ అధికారులతో కో ఆర్డినేట్ చేసుకోవడంతో పాటు స్థానిక ఎంపి, ఎంఎల్‌ఎల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత మాట్లాడుతూ జిల్లా పరిధిలో నర్సంపేట, పరకాల మున్సిపాలిటీలు ఉన్నాయని సమగ్రంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయుటకు స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
మార్చి 30లోగా పరకాల నియోజకవర్గానికి శుద్ధమైన తాగునీరు
పరకాల నియోజకవర్గానికి ఈనెల 30వ తేదీలోగా శుద్ధమైన తాగునీరు అందించే లక్షంతో చేపడుతున్న పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. మంగళవారం మిషన్ భగీరథ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరాజుపల్లిలో ఇన్‌టేక్‌వెల్, పంపుసెట్లు, పైపులైన్, సంప్ జిఎల్బిర్, ఓహెచ్‌బి ఆర్ కంపోనెంట్ పనులు పూర్తి అయ్యాయని, నీటిని విడుదల చేసి అక్కడి నుంచి హాబీటేషన్స్‌కి వెళ్లే పైపులైన్ టెస్టింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు. పరకాల టౌన్‌కి పూర్తి స్థాయిలో టెస్టింగ్ పూర్తి అయిందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీలోగా టెస్టింగ్ పూర్తి చేసుకొని పరకాల నియోజకవర్గంలోని 155 హ్యాబిటేషన్స్‌కు తాగునీరు అందించాలన్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌కి 4 బృందాలు ఉన్నాయని అవి ఏమ్రాతం సరిపోవని బృందాలను సూచించాలని ఆమె ఆదేశించారు. సింగరాజుపల్లి నుంచి పరకాల పట్టణానికి, పరకాల, ఆత్మకూరు, దామెర మండలాలకు ఒకలైన్ అదేవిధంగా గీసుకొండ, సంగెం, మండలాలకు ఒక లైన్ ఇలా మూడు ప్రత్యేక పైపులైన్లు ఉన్నందున ఇప్పటికే పరకాల పట్టణం పైపులైన్ పూర్తైనందున మిగిలిన రెండు లైన్ల టెస్టింగ్ పనులు సమాంతరంగా పూర్తి చేయాలని తెలిపారు. ఇచ్చిన గడువులోగా పూర్తి చేసే విధంగా మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. నర్సంపేటలో 472 హ్యాబిటేషన్స్ ఉన్నాయని ఎప్రిల్‌లో టెస్టింగ్ పూర్తి చేస్తామని అధికారులు తెలుపగా నర్సంపేట ప్రాంతంలో హ్యాబిటేసన్స్ మధ్య దూరం ఎక్కువ ఉంటుందని, టెస్టింగ్ వేగవంతంగా పూర్తి అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలకు ఎప్పటి వరకు టెస్టింగ్ పూర్తి అవుతుంది. నివేదిక ఇవ్వాలని తెలిపారు.
– డబుల్ బెడ్‌రూం ఇళ్లను వేగవంతం చేయాలి
డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరిత తెలిపారు. మంగళవారం డబుల్‌బెడ్ రూం ఇండ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారిగా ఇప్పటికే ప్రారంభించిన ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మండలాల వారిగా మంజూరైన ఇండ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పర్వతగిరి మండలంలోని చింతనెక్కొండ, సోమారంలో మే చివరి నాటికి ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆర్ అండ్‌బి అధికారులు తెలిఆపరు. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో 1020 ఇండ్లు చేపట్టాల్సి ఉందని సంబంధిత గ్రామాల్లో స్థల ఆవశ్యకతపై నివేదిక ఇవ్వాలని ఆర్‌డిఒకు తెలిపారు. స్థల ఆవశ్యకత ఆధారంగా టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు. పరకాల, ఆత్మకూరు, సంగెం మండలాల్లోని వెల్లంపల్లి, చర్లపల్లి, ఆత్మకూరు, గుడెప్పాడ్, రామచంద్రాపురం గ్రామా ల్లో ప్రారంభించిన 400 ఇండ్లు నిర్మాణాలను మే, జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. రాయపర్తి మం డలంలోని కేశవాపూర్, రాయపర్తి, మైలారం, కొం డూరు గ్రామాల్లో చేపడుతున్న 225 ఇండ్ల పనులను మే చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. అంతకుముందు మిషన్ కాకతీయ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మిషన్ కాకతీయ నాలుగు విడతలలో మంజూరైన పనులు పురోగతిపై ఆరా తీశారు. మిషన్ కాకతీయ మొదటి ఫేస్‌లో 224 చెరువులు చేపట్టగా రెండు పెండింగ్ ఉన్నాయని అదేవిధంగా రెండవ ఫేస్‌లో 199గాను 154 పూర్తి, మూడవ ఫేస్‌లో 162 మంజూరు కాగా 50 పూర్తి, నాలుగవ ఫేస్‌లో 158 మంజూరి కాగా 34 పనులు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఒ శేఖర్‌రెడ్డి, ఆర్డిఒ మహేందర్‌జీ, ఇరిగేషన్, ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్, సంబంధిత అధికారులు తెలిపారు.

Comments

comments