Search
Wednesday 21 March 2018
  • :
  • :
Latest News

సిఎం కెసిఆర్ సినిమా చూపిస్తున్నారు: విహెచ్

HanumanthaRao1

హైదరాబాద్: కాంగ్రెస్ సీనయర్ నేత వి హనుమంతరావు మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ నేతలను సస్పెండ్ చేయడంపై విహెచ్ ఘాటుగా స్పందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజ్‌కపూర్ సినిమా కంటే గొప్ప సినిమాని సిఎం కెసిఆర్ చూపిస్తున్నారంటూ విహెచ్ అన్నారు. ఇంత పెద్ద డ్రామా తాను జీవితంలో చూడలేదని మండిపడ్డారు. కేవలం గౌడ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి దెబ్బ తగిలినట్టు నాటకం ఆడిస్తూ టిఆర్‌ఎస్ డ్రామాకు తెరలేపిందన్నారు. హెడ్‌ఫోన్స్‌తో అసలు దెబ్బ తగులుతుందా, దీన్ని జనం ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. పేదలకు రెండు గదుల ఇళ్లు ఇస్తామని తానే మూడు ఇళ్లు కట్టుకున్నారని కెసిఆర్‌పై ఆయన ధ్వజమెత్తారు. ప్రశ్నించిన ప్రతిపక్ష సభ్యులందరిని సభ నుంచి సస్పెండ్ చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందని విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Congress Senior Leader V Hanumantha Rao Criticizes CM KCR.

Comments

comments