Search
Wednesday 20 June 2018
  • :
  • :

లోకేష్ అవినీతి బాబుకు కనిపించడం లేదా?

pawan

గుంటూరు: మంత్రి లోకేష్ చేస్తున్న అవినీతి చంద్రబాబుకు కనిపించడం లేదా?, లోకేష్ అవినీతి మీ దృష్టికి వచ్చిందా? రాలేదా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. బుధవారం గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ఐటీ దాడుల్లో దొరికిపోయిన టిడిపి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ పేరు వినిపించిదని, లోకేష్‌ను కాపాడుకోవడానికే చంద్రబాబు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారని, అందుకే ప్రధాని మోడీకి ఆయన భయపడుతున్నారని ప్రచారం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు ఎందుకు తాకట్టు పెట్టారు?, అర్థరాత్రి చీకటి ఒప్పందం చేసుకొని ప్యాకేజీని చంద్రబాబు ఒప్పుకున్నారా? అని నిలదేశారు. రాష్ట్రంలో టిడిపి నేతల దోపిడి కొనసాగుతుందని మండిపడ్డారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వో నీరజాక్షిపై దాడి చేస్తారా?, మహిళ అదికారిపై దాడి చేసేందుకు టిడిపి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కొమ్ములు ఉన్నాయా? అంటూ ద్వజమెత్తారు. ఆ ఎమ్మెల్యేకు చట్టం వర్దించదా?, ప్రభుత్వం ఏం చేస్తుంది? అని ఈ సందర్భంగా పవన్ ప్రశ్నించారు.

Comments

comments