Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

స్వామిగౌడ్‌కు మరోసారి కంటి పరీక్షలు

SWAMY

హైదరాబాద్ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు మరోసారి కంటి పరీక్షలు చేయనున్నారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన కాంగ్రెస్ ఎంఎల్‌ఎల దాడిలో స్వామిగౌడ్ కంటికి గాయమైన విషయం తెలిసిందే. తక్షణమే ఆయన్ను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. స్వామిగౌడ్ కంటిలో యాబై శాతం కార్నియా దెబ్బతిందని సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఆయనకు మందులతో చికిత్స చేస్తున్నామని రవీందర్‌గౌడ్ చెప్పారు. స్వామిగౌడ్ కోలుకుంటున్నారని, బుధవారం ఉదయం మరోసారి ఆయనకు పరీక్షలు చేసి, తదుపరి చికిత్సపై నిర్ణయం తీసుకుంటామని రవీందర్‌గౌడ్ వెల్లడించారు.

Eye Tests to Swamy Goud once again

Comments

comments