Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

మద్దతు ధర కోసమే

ministr

రైతు సమితులు ఆధిపత్యానికి కాదు
చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూ గుత్తా

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎవరి మీదనో అధిపత్యం చెలాయించేందుకు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కాలేదని, పంటలకు మద్దతు ధర ఇప్పించడమే లక్షమని చైర్మన్, ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సహకరించుకునే ధోరణిలో ముందుకు పోవాలే తప్ప కలహించుకోరాదన్నారు. బషీర్‌బాగ్‌లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గుత్తా మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో ఉందని, దేశానికే మనం దిక్సూచి అయ్యే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయానికి సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అందులో భాగంగానే పంటకు పెట్టుబడి పథకాన్ని ముందుకు తెచ్చారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. చట్టసభలలో ఉన్నది అందరూ రైతు బిడ్డలేనని అయితే రైతుకు మాత్రం న్యాయం జరగడం లేదన్నారు. రైతు సమన్వయ సమితి చైర్మన్, వ్యవసాయ మంత్రిగా తాను బండికి రెండు చక్రాలుగా పని చేసి రాష్ట్ర వ్యవసాయాన్ని ఉన్నత పథంలోకి తీసుక వెళ్ళాల్సిన బాధ్యత ఉందని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉచిత కరెంటు, సాగునీటి పెద్ద ఎత్తున పథకాలు, రెండు పంటలకు పెట్టుబడి, ప్రతీ 5వేల ఎకరాలకు ఒక విస్తరణాధికారి వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నారు. రైతు సమన్వయ సమితులు ఎవరి మీద పెత్తనం చేయడానికి కాదని, పరస్పర సహకారంతో కుటుంబ సభ్యులుగా పనిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పట్నం మహేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, రైతు సమితుల కో ఆర్డినేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.
2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం : కెటిఆర్
వ్యవసాయంలో విప్లవాత్మక సంస్కరణలకు సిఎం కెసిఆర్ నాయకత్వంలో శ్రీకారం చుట్టామని, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఐటిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. రైతు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎస్. స్వామినాథన్‌తో సహా పలు శాస్త్రవేత్తలు చేసిన సిఫార్సులను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరా సాగుకు నీరు ఇవ్వడం ద్వారా హరిత విప్లవం, చెరువులు, కుంటలను పరిరక్షించుకుని, అందులో చేపలు పెంపకం చేపట్టడం ద్వారా నీలి విప్లవం, గొర్రెల పంపిణీతో మాంసోత్పత్తితో గులాబీ విప్లవం, పాల ఉత్పత్తుల్ని పెంచడంతో క్షీర విప్లవం సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Comments

comments