Search
Wednesday 20 June 2018
  • :
  • :

వడదెబ్బకు చెక్ పెట్టండిలా..

life
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు కారణంగా వడదెబ్బ, డీహైడ్రేషన్‌లకు గురవుతుంటారు చాలామంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో ఏమేం పనులు ఎప్పుడు చేయాలో చేయకూడదో తెలసుకుందాం..
మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగకూడదు.మద్యం సేవించకూడదు.
-* రోడ్ల మీద అమ్మే చల్లని రంగు పానీయాలు తాగకూడదు.
-* మాంసాహారాన్ని తగ్గించాలి. ఆహారంలో తాజా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
-* ఇంటిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో శుభ్రత పాటించి, దోమలు లేకుండా చూసుకోవాలి.

చేయాల్సినవి…
*నీరు పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోaవాలి.
-*రోజూ కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.
-*పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
-* శుభ్రంగా రెండు పూట్ల స్నానం చేయాలి.
-*భోజనం మితంగా చేయాలి.
-*లేత వర్ణం, తేలికైన , కాటన్ దుస్తులు ధరించాలి.
-*ఆరు బయట పడుకున్నా దోమతెరల వంటివి వాడుకోవాలి.
-*ఎండవేళ ఇంటిపట్టునే ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు , టోపీ, స్కార్ఫ్‌లాంటివి తీసుకె ళ్లాలి.
-*ఇంట్లో కిటికీ తలుపులు తెరిచి ఉంచండి. ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి.
వడదెబ్బ తగిలితే ప్రథమ చికిత్స
-*వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడగల ప్రదేశానికి చేర్చాలి.
-*ఐస్ నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి.
*శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చేవరకు ఇలా చేస్తుండాలి.
*ఫ్యాను గాలి, చల్లని గాలి తగిలేలా ఉంచాలి.
*ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం (ఓఆర్‌ఎస్)     తాగించవచ్చు.
-*వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు.
-*వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.

Comments

comments