Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

విదేశీ న్యాయవాదులు భారత్‌లో ప్రాక్టీస్ చేయరాదు

supreme-court

ఢిల్లీ : విదేశీ న్యాయ సంస్థలు, విదేశీ న్యాయవాదులు భారత్‌లో ప్రాక్టీస్ చేయరాదని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును ఇచ్చింది. జస్టిస్ ఆదర్శ్ కె గోయల్, జస్టిస్ ఉదయ్ , లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ఇచ్చింది. విదేశీ న్యాయవాదులు భారత్‌లో ప్రాక్టీస్ చేయడానికి అనర్హులని, అయితే విదేశీ చట్టాలపై సలహాలు ఇచ్చేందుకు వారు భారత్‌కు రావొచ్చని తన తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా త్వరలోనే నిబంధనలు తయారు చేస్తాయని కోర్టు పేర్కొంది. భారత్‌లో విదేశీ న్యాయసంస్థలకు అనుమతిపై మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు పరస్పరం భిన్నమైన తీర్పులు ఇచ్చాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పును ఇచ్చింది.

Foreign Lawyers Should not Practice in India

Comments

comments