Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రభసభ

ph

కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం 

బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ కాంగ్రెస్ ప్లకార్డుల నిరసన
కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్ హెడ్‌సెట్ తగిలి గాయపడిన కౌన్సిల్ చైర్మన్
సరోజినిలో చికిత్స కార్నియాకు దెబ్బ తగిలినట్లు ఆసుపత్రి ప్రకటన ప్రముఖల పరామర్శ

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం సమావేశాలు ఆరంభం కాగానే గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసం గం ప్రారంభించారు. కొద్దిసేపటికే కొంత మంది కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల నుంచి స్పీకర్ పోడి యం సమీపానికి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ‘దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, రైతు ల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి’ అంటూ వారు నినాదాలు చేశా రు. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి పోడియం వైపు విసిరారు. వారిని మార్షల్స్ అడ్డుకోవడంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గవర్నర్ ప్రసంగించినంత సేపూ కాంగ్రెస్ సభ్యులు పోడియం దగ్గరే నిలబడి నిరసన తెలిపారు. ఆ పార్టీ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మైక్ హెడ్‌ఫోన్‌ను పోడియం వైపు విసరగా అది గాంధీ ఫొటోకు తగిలి దాని కింద కుర్చీలో కూర్చున్న శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై పడిం ది. దీంతో ఆయన కంటికి గాయమైంది. అసెంబ్లీ నుంచి నేరుగా సరోజినిదేవి కంటి ఆసుప్రతికి వెళ్ళి చికిత్స చేయించుకున్నారు. డాక్టర్లు ఆయన కంటికి తగిలిన గాయాన్ని పరిశీలించి ప్రాథమిక చికిత్స చేసినట్లు ఆసుప్రతి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. కార్నియాకు దెబ్బతగిలిందని, దీనికి తగిన చికిత్సను అందిస్తున్నామని ఆయన వివరించారు. కన్ను సాధారణ స్థితికి చేరుకోవడానికి కనీసం నెల రోజులు పడుతుందని, ఎలాంటి శస్త్రచికత్స అవసరం లేదని చెప్పారు. మందులతోనే ఇది తగ్గుతుందని సూపరింటెండెంట్ వివరించారు. ఆసుప్రతిలో చేరిన స్వామిగౌడ్‌ను ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, పలువురు మంత్రులతో పాటు అనేకమంది ప్రజాప్రతినిధులు పరామర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లకా్ష్మరెడ్డి ఆసుప్రతికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. గాయంపై సూపరింటెండెంట్‌తో చర్చించారు. చికిత్సకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని మంత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండలి ఛైర్మన్‌ను పరామర్శించిన వారిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంఎల్‌సి శ్రీనివాసరెడ్డి, ఎంపి కేశవరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ ఆరోగ్య పరిస్థితి గురించి సూపరింటెండెంట్‌తో చర్చించారు. ఇదిలా ఉండగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం పట్ల నిరసన తెలియజేస్తూ బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతిని సభ్యులకు అందించగానే వాటిని చదివిన కొద్ది సేపటికే బిజెపి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు.

Comments

comments