Search
Wednesday 20 June 2018
  • :
  • :

నిధి కోసం అన్వేషణ

prabu
ప్రభుదేవా, హన్సిక జంటగా నటించిన తమిళ చిత్రం ‘గులేబకావళి’. కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటి రేవతి ఓ శక్తివంతమైన పాత్రలో నటించారు. తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కడ ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రై.లి. పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈనెల 23న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ “తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే విశ్వాసంతో తెలుగులోకి అనువదిస్తున్నాను. గులేబకావళి అనే గ్రామంలో నిక్షిప్తమైన నిధి కోసం జరిగే అన్వేషణ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుంది. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే హైలైట్‌గా ఉంటుంది. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా నృత్యాలు, నటన ప్రధాన ఆకర్షణగా ఉంటాయి”అని తెలిపారు. మన్సూర్ అలీఖాన్, మధు, ఆనంద్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరాః ఆర్‌ఎస్ ఆనంద్‌కుమార్, సంగీతంః వివేక్ మెర్విన్, పాటలుః సామ్రాట్, ఫైట్స్‌ః పీటర్ హెయిన్స్.

Comments

comments