Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

లెక్చరర్‌ను కాల్చి చంపిన విద్యార్థి..!

Shoot to Transgender

చండీగఢ్: హర్యానాలోని సొనిపత్ జిల్లాలో మంగళవారం దారుణం జరిగింది. కళాశాలలో లెక్చరర్‌ను ఓ విద్యార్థి అతి దారుణంగా కాల్చి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం… జిల్లాలోని ఖార్ఖొడాలో గల షాహీద్ దల్బీర్ సింగ్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి కళాశాల స్టాఫ్ రూంలోకి వెళలి అక్కడ ఉన్న రాజేష్ మాలిక్ అనే లెక్చరర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అధ్యాపకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే లెక్చరర్‌పై సదరు విద్యార్థి ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న విద్యార్థిని పట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

Haryana Student Guns Down Teacher in College Staff Room.

Comments

comments