Search
Wednesday 20 June 2018
  • :
  • :

రబడా @ 1

rabada
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడా బౌలింగ్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఏకంగా పదకొండు వికెట్లు పడగొట్టిన రబడా తన ర్యాంకింగ్స్‌ను గణనీయంగా పెం చుకొని నంబర్‌వన్‌గా నిలిచాడు. రబడా 902 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో టెస్టులో రబడా అసాధారణ రీతిలో చెలరేగి పోయిన విషయం తెలిసిం దే. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతను నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అయితే ఈ ఆనందం రబడాకు ఎక్కువ సేపు నిలువలేదు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్‌తో దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలపై ఐసిసి రబడాపై రెండు టెస్టుల నిషేధాన్ని విధించింది. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు రబడా దూరమయ్యాడు. ఇదిలావుండగా ఇంగ్లాండ్ స్పీడ్‌స్టర్ జేమ్స్ అండర్సన్ రెండో ర్యాంక్‌లో నిలిచాడు. భారత బౌలర్లు రవీంద్ర జడేజా మూడో, రవిచంద్రన్ అశ్విన్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ హాజిల్‌వుడ్‌కు ఐదో ర్యాంక్ లభించింది.

కోహ్లి స్థానం పదిలం..

vrt

మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కోహ్లి 912 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 943 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జోయ్ రూట్ మూడో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ సారథి కానె విలియమ్సన్‌కు నాలుగో ర్యాంక్ దక్కింది. ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ స్టార్ సాకిబ్ అల్ హసన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత స్టార్లు రవీంద్ర జడేజా రెండో, రవిచంద్రన్ అశ్విన్ మూడో ర్యాంక్‌లో నిలిచారు. ఇంగ్లాండ్ స్టార్ బెన్ స్టోక్స్ నాలుగో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఫిలాండర్‌కు ఐదో ర్యాంక్ లభించింది. టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. భారత్ 121 పాయింట్లతో ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా115 పాయింట్లతో రెండో ర్యాంక్‌ను కాపాడుకుంది. ఆస్ట్రేలియా మూడో ర్యాంక్‌లో నిలిచింది. న్యూజిలాండ్‌కు నాలుగో, ఇంగ్లాండ్‌కు ఐదో ర్యాంక్ లభించింది.

Comments

comments