Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పచ్చబొట్లు తొలగించుకుంటున్నారు…

Tattoos

అత్యధికంగా పచ్చబొట్లు(టాటూ)ను తొలగించే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. 2016 లెక్కల ప్రకారం దాదాపు 22,860 మంది పచ్చబొట్లు తొలగించే శస్త్ర చికిత్సలు జరిపించుకున్నారని ఒక సర్వేలో పరిశోధకులు తెలిపారు. పచ్చబొట్లు వల్ల కలుగుతున్న సైడ్ ఎఫెక్టులు ఒక కారణం కాగా, వ్యక్తిగత సమస్యలు కూడా మరో కారణం. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తుల పేర్లను పచ్చబొట్లు పొడిపించుకునేవారు.. ప్రేమ విఫలమైనప్పుడు వాటితో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీంతో, వాటిని తొలగించాలంటూ ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు స్కిన్ ఎలర్జీ సమస్యలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. యువత పచ్చబొట్ల వల్ల ఉద్యోగాలు దొరకని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. పచ్చ బొట్ల వల్ల పెళ్లిల్లు జరగడం కూడా కష్టంగా మారిందని కొంతమంది వాపోతున్నారు. దీంతో, దేశంలో పచ్చబొట్లను తొలగించుకునేవారి సంఖ్య క్రమేనా పెరిగాయి.

Comments

comments