Search
Wednesday 20 June 2018
  • :
  • :

బంగ్లా చిత్తు… ఫైనల్‌కు భారత్

t20

కొలంబో: ట్రై సిరీస్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి టి20 లీగ్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లాపై 18 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.దీంతో భారత్ నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.కెప్టెన్ రోహిత్ శర్మ 89(61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ధావన్35(27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), సురేష్ రైనా 47(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగులతో రాణించారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహీమ్ 72 పరుగులతో పోరాడిన ఫలితం దక్కలేదు. తమీమ్ ఇక్బాల్ 27, షబ్బీర్ 27 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో వాషింగ్‌టన్ సుందర్ 3 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. సిరాజ్ శార్దూల్, చాహల్ తలో వికెట దక్కించుకున్నారు.

Comments

comments