Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

భారత మహిళల ఓటమి

aus

వడోదర: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా క్రికెట్ జట్టు ఓటమి పాలైంది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలి యా 8వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అం దుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 200 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 32.1 ఓవర్లలోనే కేవలం రెం డు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ నికొలె బోల్టన్ అజేయ శతకం తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు బోల్టన్, అలీసా హిలీ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. అలీసా దూకుడుగా ఆడుతూ స్కో రును పరిగెత్తించింది. చెలరేగి ఆడిన అలీసా 29 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేసి ఔటైంది. తర్వాత వచ్చిన కెప్టెన్ మెక్ లానింగ్ అండతో బోల్టన్ జోరును కొనసాగించింది. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ జట్టును లక్షం వైపు నడిపించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆ డిన లానింగ్ ఐదు ఫోర్లతో 33 పరుగులు సా ధించింది. మరోవైపు ఎలిసె పెరీ 25 (నాటౌటైట్) తో కలిసి బోల్టన్ మిగతా లాంఛనాన్ని పూర్తి చేసింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బోల్టన్ 101 బం తుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు చేసి అజేయ ంగా నిలిచింది. దీంతో ఆస్ట్రేలియా మరో 17.5 ఓవర్లు మిగిలివుండగానే లక్ష్యాన్ని అందుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను ఆస్ట్రేలియా బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. అమంద వెల్లింగ్టన్, జెస్ జొనాసెన్‌లు అద్భుత బౌలింగ్‌తో భారత ఇన్నింగ్స్ కుప్పకూల్చారు. అమందకు మూడు, జొనాసెన్ నాలుగు వికెట్లు దక్కాయి. భారత జట్టులో ఓపెనర్ పూనమ్ రౌత్ (37), వికెట్ కీపర్ సుష్మా వర్మ (41) రాణించారు. పూజా వస్త్రాకర్ ఏడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారు విఫ లంతో భారత్ భారీ స్కోరును సాధించలేక పోయింది.

Comments

comments