Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

పార్టీ మారిన వైసిపి ఎంఎల్‌ఎల కేసుపై విచారణ

AP-HIGH-COURT

హైదరాబాద్ : వైసిపి నుంచి విజయం సాధించి, అనంతరం అధికార టిడిపిలో చేరిన ఎంఎల్‌ఎల కేసుపై మంగళవారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ మారిన 22 మంది ఎంఎల్‌ఎలతో పాటు ఎపి అసెంబ్లీ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసును రెండు వారాల పాటు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయించిన 22 ఎంఎల్‌ఎలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎంఎల్‌ఎ అన్నా వెంకట రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన పిటిషన్‌పై మంగళవారం కోర్టు విచారణ జరిపింది.

Inquiry in High Court on Party’s Changed  MLAs

Comments

comments