Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

కోమటిరెడ్డి – సంపత్ దీక్ష

KOMATI---SAMPATH

హైదరాబాద్ : తమ శాసన సభ్యత్వాలను రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లు గాంధీభవన్ వద్ద మంగళవారం సాయంత్రం దీక్షకు దిగారు. వీరి దీక్ష రెండు రోజుల పాటు జరగనుంది. ఈ దీక్ష ప్రారంభం సందర్భంగా కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు,ఎంఎల్‌సిలతో పాటు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎంఎల్‌ఎల సభ్యత్వాలను రద్దు చేసిన ఘటనలు దేశ చరిత్రలో లేవని ఆయన చెప్పారు. తెలంగాణ సిఎం కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని సభలో లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. కుట్ర పూరితంగా ఇద్దరు సభ్యుల సభ్యత్వాలను రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గాంధేయమార్గంలో దీక్ష పేరుతో సత్యాగ్రహం చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. దేశ చరిత్రలో విపక్ష నేతను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవని ఆయన చెప్పారు. శాసన సభ్యుల సభ్యత్వాలనే రద్దు చేస్తే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తమ ఎంఎల్‌ఎల సభ్యత్వ రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు దీక్షకు దిగడంతో గాంధీభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Komati Reddy – Sampath Diksha at Gandhi Bhavan

Comments

comments