Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం

KV

నల్గొండ : తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై మాజీ మంత్రి, నల్గొండ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దాడి చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నల్గొండలో టిఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టిబొమ్మకు పట్టణంలో శవయాత్ర నిర్వహించారు. అనంతరం పెద్ద గడియారం చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నల్గొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంచర్ల భూపాల్‌రెడ్డితో పాటు పలువురు టిఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Komatireddy Scarecrow Burning

Comments

comments