Search
Thursday 21 June 2018
  • :
  • :
Latest News

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

Man-Die-in-Road-Accident

మహబూబాబాద్: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలోని తోరూర్ మండలం అమ్మాపురంలో మంగళవారం చోటుచేసుకుంది. అమ్మాపూరం సమీపంలో రెండు బైక్‌లు ఒకదానొకటి ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాస్థలికి చేరుకున్న పోలీసులు మృతుడిని డి.సోమరం గ్రామానికి చెందిన గాందారి కృష్ణగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments